డోన్: గాంధీజీ ఆశయాలు అందరికీ ఆదర్శం: డోన్ ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Oct 2, 2026 జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని డోన్‌లో నిర్వహించిన వేడుకల్లో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహాత్మా గాంధీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో గాంధీజీ చూపిన అహింస, సత్యం, శాంతి మార్గాలు ప్రపంచానికే మార్గదర్శకమని కొనియాడారు.