శ్రీకాకుళం: టెక్కలిలో విషాదం: పట్టాలపై నడుచుకుంటూ వెళ్తుండగా రైలు ఢీకొని నలుగురు విద్యార్థులు మృతి
టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తుండగా రైలు ఢీకొని నలుగురు మృతి చెందారు. వర్షం, ఈదురుగాలుల కారణంగా రైలు రాకను గమనించలేకపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి.