హిందూపురం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఏసీల గోల్మాల్
సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికుల డిమాండ్
హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏసీలు గోల్మాల్ కు గురయ్యాయని ఆరోపణలు పడుతున్నాయి. ఆసుపత్రిలో విధులు నిర్వహించే ఓ కార్యాలయ సిబ్బందికి ఎలక్ట్రిషన్ ఆధీనంలో ఉన్న ఏసీ ని ఇంటికి వెళ్లి ఇంటిలో బిగించినట్లు ఆరోపణలు రావడంతో పాటు వైద్య విధాన పరిషత్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో ఏసీ ని మరల ఆసుపత్రిలోకి తీసుకొచ్చి పెట్టినట్లు తెలుస్తుంది. అయితే తీసుకెళ్లిన ఏసి ఏది....తెచ్చి పెట్టిన ఏసి ఏది...? రెండు ఒకటేనా అని అనుమానాలు ఆసుపత్రి సిబ్బందిలో వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం బయటకు రావడంతో గత నెల మెడికల్ సూపరీటెండెంట్ అన్నపూర్ణ కలెక్టర్ సూచనల మేరకు మెమో ఇచ్చారు ఇలా ఇంకెన్ని మాయమయ్యాయి అని