జమ్మికుంట: కొత్త మార్కెట్ ఆవరణలో బాలవికాస స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అనాధ పిల్లల జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎంపీ ఈటల
జమ్మికుంట: పట్టణంలోని కొత్త మార్కెట్ ఆవరణలో మంగళవారం సాయంత్రం బాలవికాస స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అనాధ పిల్లల పుట్టినరోజు వేడుకల్లో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవారికి అండగా ఉండాలని బాలవికాస సంస్థ కృషి చేయడం చాలా అభినందనీయమని అన్నారు.ఆడపిల్ల అమ్మగారి ఇంటికి వస్తే ఎలా ఉంటుందో నేను హుజురాబాద్ కు వస్తే అలా ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ కార్యక్రమంలో బాలవికాస వ్యవస్థాపకులు కెనడా దేశానికి చెందిన బాల తెరిసా జింద్రాస్ అలియాస్ బాలమ్మ సోపర్ బోర్డు మెంబర్ బెర్నార్డ్ మౌనికలు తోపాటు పట్టణంలోని పుర ప్రముఖులు పాల్గొన్నారు.