ఇంద్రవెల్లి: సమస్యల పరిష్కారం కోసం ముత్నూర్ నుంచి ఇంద్రవెల్లి స్తూపం వరకు సమగ్ర శిక్ష ఉద్యోగుల ర్యాలీ
న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమగ్ర శిక్ష ఉద్యోగులు గురువారం ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ముత్నుర్ నుండి ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించారు.ఈ సందర్బంగా తుడుం దెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేష్ మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న నేపథ్యంలో విద్యావ్యవస్థ పూర్తిగా కుంటు పడి పోయింది అన్నారు.వారి న్యాయమైన డిమాండ్ల ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసారు.