హిందూపురం టీచర్స్ కాలనీలో ఐరన్ స్క్రాప్ గుజిరి గోడౌన్లో అగ్నిప్రమాదం 20 లక్షల విలువచేసే స్క్రాప్ మంటలకు ఆహుతి
హిందూపురం పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఐరన్ స్క్రాప్ గుజిరి గౌడన్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 20 లక్షల విలువచేసే ఐరన్ స్క్రాప్ మంటలకు ఆహుతి అయినట్లు స్థానికులు తెలిపారు.మంటలు పక్కన ఉన్న ఇళ్లకు వ్యాప్తి చెందుతున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైర్ ఇంజన్ లో నీళ్లు అయిపోవడంతో స్థానికులు ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ ప్రయత్నం కూడా సఫలం అవుతున్నట్లు లేదని తమ ఇళ్లన్నీ మంటలకు ఆహుతైతాయని భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని మంటలు ఆర్పాలని స్థానికులు కోరుతున్నారు.