శ్రీశైలం: వెలుగోడు గ్రామంలో వరుణ దేవుడి కరుణ కోసం మూడవ రోజు భజన కార్యక్రమాలు
వెలుగోడు పట్టణంలో వరుణ దేవుడి కటాక్షం కోసం నిర్వహిస్తున్న తొమ్మిది రోజుల ప్రత్యేక పూజలు, భక్తి భజనలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నాలుగో రోజు ఆదివారం రాత్రి 8 గంటలకు తెలుగు పేటలోని శ్రీ లింగమయ్య స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి.భక్తులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించి, అనంతరం గ్రామంలోని పలు వీధుల్లో భక్తి భజనలతో భారీ ప్రదర్శన చేపట్టారు. వందలాది మంది భక్తులు ఐకమత్యంతో పాల్గొని భజనలు చేస్తూ గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.ఈ కార్యక్రమం రాత్రి 12 గంటల వరకు కొనసాగగా, మహిళలు, యువకులు, చిన్నారులు సహా అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు.