ముమ్మిడివరం: ముమ్మిడివరం నగర పంచాయతీ ఎన్నికలు: ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను కమిషనర్ రవివర్మ పరిశీలించారు. జడ్పీ బాలికల పాఠశాలలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నామినేషన్ల ఉపసంహరణ జరుగుతోందని, ఓటర్లు నిర్భయంగా ఓటు వేసేలా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.