రోడ్లపై వ్యాపారం చేస్తూ ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్, మినీ ట్యాంక్ బండ్ సమీపంలో రహదారిపై వ్యాపారం చేస్తూ ట్రాఫిక్ ఇబ్బందులకు గురి చేస్తున్న వారిని హెచ్చరించి తోపుడు బండ్లను శనివారం తొలగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రహదారులను ఆక్రమించి వ్యాపారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు. మున్సిపల్ అధికారులు ప్రతిరోజు తనిఖీలు చేపట్టాలని, నిబంధనలు పాటించని వారికి ఫైన్ వేయాలని సూచించారు.