ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : బనవాసి గ్రామంలో నీటి సరఫరా వ్యవస్థ కుప్పకూలింది. 20 రోజులుగా గ్రామస్తులకు నీటి గుమ్మిల ద్వారా నీటి ఆటంకం..
బనవాసిలో నీటి ఎద్దడి: అధికారులు, సర్పంచ్ చేతులెత్తేశారు ఎమ్మిగనూరు మండలంలోని బనవాసి గ్రామంలో నీటి సరఫరా వ్యవస్థ కుప్పకూలింది. 20 రోజులుగా గ్రామస్తులకు నీటి గుమ్మిల ద్వారా నీరు అందడం లేదు. అధికారులు, గ్రామ పంచాయతీ సెక్రెటరీ, సర్పంచ్ కూడా ఈ సమస్యపై స్పందించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చర్చి దగ్గర, మాలగేరిలో, పెద్దకడబూరు రోడ్డులో ఉన్న మూడు గుమ్మిలకు నీరు అందడం లేదు. పంచాయతీ కొళాయిలు రోజుకు ఒక గంట మాత్రమే వదులుతున్నాయని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు.