శ్రీశైలం: అటవీ డివిజన్లో భారీ అవినీతికి పాల్పడ్డ రిటైర్డ్ ఉద్యోగిపై AOC చార్ట్ తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఆత్మకూరు అటవీ డివిజన్లోని ఉద్యోగి కోట్లు కొట్టేసిన వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ అక్రమాలకు పాల్పడిన రిటైర్డ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ చాంద్ బాషా పై నేరారూపణ పత్రాన్ని AOC (ఆర్టికల్ ఆఫ్ చార్ట్) తెరవాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఛాంద్ బాష చేసిన అక్రమాలు గత ఏడాది బయటపడగానే ఆయనపై అటవీ శాఖ అధికారులు ఆత్మకూరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చారు