అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని పెద్దొడ్డి గ్రామంలో కురువ లక్ష్మీనారాయణ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి గుత్తి పోలీసులు, కుటుంబసభ్యులు సోమవారం తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తి మండలం పెద్దొడ్డి గ్రామానికి చెందిన కురువ లక్ష్మీనారాయణకు 4.30 ఎకరాల పొలం ఉంది. వర్షాధారం కింద వేరుశనగ, కంది పంటలు సాగు చేశాడు. పంటల సాగులో దిగుబడి రాక అప్పుల పాలయ్యాడు. అనారోగ్యానికి గురై పలు ఆసుపత్రులలో చికిత్స చేయించుకున్నా నయం కాలేదు. దీంతో ఆత్మహత్య చేసుకున్నాడు.