చోడవరం: రోలుగుంటలో ఎంపీటీసీ నామినేషన్ల సందడి: రెండో రోజు 53 నామినేషన్లు
రోలుగుంట మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. రెండో రోజు 53 నామినేషన్లు దాఖలు కాగా, మొత్తం నామినేషన్ల సంఖ్య 67కి చేరింది. వైసీపీ నుంచి 25, టీడీపీ నుంచి 18, జనసేన నుంచి 7, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అత్యధికంగా బుచ్చింపేటలో 10 నామినేషన్లు నమోదయ్యాయి.