శ్రీశైలం: ఆత్మకూరు పట్టణంలోని పాత బస్టాండ్ లో ఘనంగా బాబు జగజీవన్ రామ్118వ జయంతి వేడుకలు
ఆత్మకూరు పట్టణంలోని పాత బస్టాండ్ సర్కిల్ లోని అంబేద్కర్ స్పూర్తి కేంద్రం వద్ద బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేశారు.ఈ సందర్భంగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు భాషాపోగుల దరగయ్య మాదిగ పాల్గొని బాబు జగజీవన్ రామ్ దళితుల అభ్యున్నతికి చేసిన సేవలు, ఆయన రాజకీయ ప్రస్థానం గురించి వివరించారు. ఈ కాలం రాజకీయ నాయకులు బాబు జగజీవన్ రామ్ ఆదర్శంగా తీసుకోవాలని, నేటి యువత ఆయన చరిత్ర తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఇతర పట్టణ వాసులు పాల్గొన్నారు.