సామర్లకోట-పెద్దాపురం ప్రధాన రహదారిలో, స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొన్న,ప్రైవేట్ బస్సు,ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు
కాకినాడ జిల్లా సామర్లకోట పెద్దాపురం ప్రధాన రహదారి, పెద్దాపురం హీరో షోరూం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది, శుక్రవారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో, స్కూటీపై వెళ్తున్న ఒక వ్యక్తిని ప్రైవేటు సంస్థకు చెందిన బస్సు ఢీకొనడంతో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో సామర్లకోటకు చెందిన కొప్పన రాంబాబు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా,. స్పందించిన స్థానికులు ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం, ఈ యొక్క ప్రమాదానికి గల పూర్తి సమాచారం ఇంకా తెలియవలసి ఉంది