కొట్నాపల్లి, శంకాడ గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించిన గూడెం కొత్తవీధి మండల వ్యవసాయ అధికారి డీ.గిరిబాబు
గూడెం కొత్తవీధి మండలంలోని కొట్నాపల్లి, శంకాడ గ్రామాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పొలం పిలుస్తోంది, వ్యవసాయ రైతు సదస్సు కార్యక్రమాలు నిర్వహించారు. ఆత్మ సిబ్బంది, రైతు సేవా కేంద్రాల సిబ్బంది, రైతులతో కలిసి ఏవో డీ.గిరిబాబు పంట పొలాలను పరిశీలించారు. యూరియా బదులు నానో యూరియా వాడాలని రైతులకు సూచించారు. వరి పంటలో ఆకుముడత పురుగు అక్కడక్కడా కనిపిస్తుందని తెలిపారు. పురుగు నివారణకు కాట్రాప్ హైడ్రోక్లోరైడ్-50 ఎస్పీ పౌడర్ పిచికారీ చేయాలని సూచించారు.