అనంతపురం జిల్లా కూడేరు మండలం జల్లిపల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ పండుగ రోజు అయిన శుక్రవారం జిల్లాస్థాయి రాతి దూలం లాగుడు పోటీలు నిర్వహించారు. రాతిదులం లాగుడి పోటీలు పోటాపోటీగా జరిగాయి. జిల్లా స్థాయి రాతిదూలం లాగుడు పోటీల్లో తోపుదుర్తికి చెందిన చెన్నప్ప వృషబాలు ప్రథమ విజేతగా నిలిచి రూ. 30000 నగదు బహుమతిని గెలుచుకున్నాయి.