శ్రీశైలం: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శించుకున్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి
ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కుటుంబ సభ్యులు శ్రీశైలంలో మల్లన్నసేవలో పాల్గొన్నారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయం రాజగోపురం వద్ద ఎమ్మెల్యే పార్థసారథికి సూపరింటెండెంట్ హర్యానాయక్, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.