అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతాపల్లి గ్రామంలో తనపై చేతబడి చేస్తున్నాడనే మూఢనమ్మకంతో శ్రీనివాసులు అనే వ్యక్తి తన తమ్ముడు రామాంజనేయులు ఇంటిలోకి పెట్రోలు చల్లి నిప్పంటించడంతో రామాంజనేయులు ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. ఈ ఘటన గుత్తి మండలంలోని బేతాపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికులు, కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తి మండలం బేతాపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు, రామాంజనేయులు వరుసకు అన్నదమ్ములవుతారు. రామాంజనేయులు శ్రీనివాసులుపై తొండను విసరగా అది మెడకు కరిచింది. దీంతో తనపై చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఇంటికి నిప్పు పెట్టాడు.