నరసన్నపేట: ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ - అభ్యర్థులకు కీలక సూచనలు
నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ వేసేందుకు వచ్చేవారు నిబంధనలను పాటించాలని, అభ్యర్థితో పాటు ముగ్గురు మాత్రమే రావాలని సీఐ ఎం శ్రీనివాసరావు మరియు ఎస్సై బి. గణేశ్ సూచించారు. కార్యాలయం వద్ద భారీ పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు.