లేపాక్షి మండలం చోళ సముద్రం పంచాయతీ నాగానపల్లెలో వర్షాలతో బురదమయమైన రోడ్లు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
శ్రీ సత్య సాయి జిల్లా లేపాక్షి మండలం, చోళ సముద్రం పంచాయతీ, నాగనపల్లి లో వర్షాకాలం వచ్చిందంటే మట్టి రోడ్లు పూర్తిగా బురదమయంగా మారాయి.ఎక్కడ చూసినా బురద, గుంతలు, నిలిచిపోయిన నీళ్లే కనిపిస్తున్నాయి.ఈ బురద రోడ్ల వల్ల స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు నిత్యం పడుతున్న పాట్లు వర్ణనాతీతం.బురదలో జారిపడటం,యూనిఫామ్లు,పుస్తకాలు పాడు చేసుకోవడం పరిపాటిగా మారింది.సకాలంలో పాఠశాలలకుచేరుకోలేకపోతున్నారు.అత్యవసర సమయాల్లో వైద్యం కోసం వెళ్లాల్సిన రోగులు, గర్భిణీ స్త్రీలు, వృద్ధుల పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు.ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదనీ వాపోయా