ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో పెద్దపార్కులో ఆటలు, వ్యాయామం కోసం వచ్చే వారికి కనీస సౌకర్యాలు లేవని విద్యార్థులు ఆవేదన #localisuue
ఎమ్మిగనూరులోని పెద్దపార్కులో ఆటలు, వ్యాయామం కోసం వచ్చే వారికి కనీస సౌకర్యాలు లేవని విద్యార్థులు విద్యాసాగర్, రాహుల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రతిరోజు క్రీడలు ప్రాక్టీస్ చేయడానికి వస్తున్నప్పటికీ మూత్ర విసర్జన, విశ్రాంతి కోసం సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి చొరవ చూపాలని కోరారు.