ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్లో ఆయుధపూజ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్లో మంగళవారం సాయంత్రం విజయదశమి సందర్భంగా ఆయుధపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు, పట్టణ సీఐ రాము ఆధ్వర్యంలో ఎస్సైలు పీరయ్య, శ్రీనివాస్ గౌడ్ పోలీస్ శాఖలో వినియోగించే ఆయుధాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, శాంతి భద్రతల పరిరక్షణలో తమ విధులను సమర్థంగా నిర్వహించాలని సంకల్పించారు ఆయుధ పూజా కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు