పూతలపట్టు: పూతలపట్టు ఆరోగ్య కేంద్రంలో మలేరియా అధికారి ఆకస్మిక తనిఖీలు
పూతలపట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జోనల్ మలేరియా అధికారి డా. నిర్మల్ అలెగ్జాండర్ తనిఖీ చేశారు. జ్వరాల పరిస్థితిపై ఆరా తీస్తూ, గ్రామాల్లో అవగాహన కల్పించాలని మరియు బాధితుల నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపాలని ఫీల్డ్ సిబ్బందిని ఆదేశించారు.