ఎమ్మిగనూరు: గోనెగండ్ల( మం)ఐరాన్ బండ గ్రామంలో దళితుల భూముల్లోకి గాజులదిన్నె నీటిని ఆపడం, వారికి పరిహారం పై గ్రామస్తులు ఆవేదన..
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజవర్గ పరిధిలోని గోనెగండ్ల మండలం ఐరాన్ బండ గ్రామంలో దళితుల భూముల్లోకి గాజులదిన్నె నీటిని ఆపడం, వారికి పరిహారం నిరాకరించడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ ఏఈ, దళితులకు భూములు ఇవ్వకూడదని, పరిహారం కూడా ఇవ్వబోమని, పట్టాలు ఇవ్వడమే తప్పని ఎద్దేవా చేశారని బాధితులు తెలిపారు. దీనిపై స్పందించి అధికారులు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.