జనగాం: జనగామలో వ్యక్తి హల్చల్: హోర్డింగ్ ఎక్కి హైడ్రామా
జనగామ ఆర్టీసీ చౌరస్తాలో పార్నంది సుధాకర్ అనే వ్యక్తి మద్యం మత్తులో హోర్డింగ్ ఎక్కి ఆందోళన చేశాడు. భార్య వేధింపుల వల్ల ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ సుమారు రెండు గంటల పాటు హల్చల్ చేశాడు. పోలీసులు క్రేన్ సహాయంతో అతడిని సురక్షితంగా కిందకు దించారు.