మహబూబ్ నగర్ అర్బన్: చట్టసభల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి: శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ గన్ పార్క్ వద్ద జరిగిన నిరసనలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.