శ్రీశైలం: మహానంది మండలంలో ఇద్దరు వన్యప్రాణుల వేటగాళ్లు అరెస్ట్. రిమాండ్ కు తరలింపు ఒరిజినల్
నంద్యాల జిల్లా మహానంది మండలంలో వన్యప్రాణులను వేటాడిన ఇద్దరు వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి అడవి పంది, అడవి పిల్లి మాంసంతో పాటు రెండు కొడవళ్లను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల వివరాల ప్రకారం, బుక్కాపురం పరిధిలోని ఓ అరటి తోటలో కరెంట్ తీగలు ఏర్పాటు చేసి అడవి పంది, అడవి పిల్లిని చంపినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి రమేష్, వెంకటేష్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరో నిందితుడు నాగరాజు పరారీలో ఉండగా, అతని కోసం పోలీసులు మరియు అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.