బేతంచెర్లలో వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి
Dhone, Nandyal | May 2, 2025 బేతంచర్ల పట్టణంలోని హనుమన్ నగర్ రైల్వే బ్రిడ్జి సమీపంలో శుక్రవారం మోహిద్దీన్ (4) అనే బాలుడిని వీధి కుక్కలు కొరికి చంపాయి. హనుమాన్ నగర్ చెందిన సయ్యద్ బాషా, ఆశ దంపతుల మూడో కుమారుడు మోహిద్దీన్ ఆడుకుంటుండగా కుక్కలు లాక్కెళ్లాయి. తీవ్రంగా గాయపరచడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో తల్లిదండ్రుల కన్నీరుమున్నీరుగా విలపించారు.