కాకినాడ సిటీ: రాష్ట్రస్థాయి పరీక్షల్లో కాకినాడ K9 బృందం సత్తా: ప్రథమ స్థానాల్లో నిలిచిన శునకాలు
విజయవాడ మంగళగిరిలో జరిగిన రాష్ట్రస్థాయి పరీక్షల్లో కాకినాడ K9 బృందం ప్రతిభ కనబరిచింది. పేలుడు పదార్థాల గుర్తింపులో 'లియో', మాదక ద్రవ్యాల గుర్తింపులో 'ర్యాండీ' శునకాలు ప్రథమ స్థానాలు సాధించాయి. విజేతలను కాకినాడ ఎస్పీ జి. బిందు మాధవ్ అభినందించారు.