భీమిలి: విశాఖపట్నం చంద్రంపాలెంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు!
విశాఖపట్నం మధురవాడలోని చంద్రంపాలెం బాపూజీ కళా మందిరం వద్ద మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక నాయకులు, గ్రామస్తులు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఈ సందర్భంగా వక్తలు పిలుపునిచ్చారు.