ఎమ్మిగనూరు టౌన్ నందు వెలసిన జై భీమ్ ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా ఉప కార్యాలయం నందు నేడు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సందర్భంగా జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఎమ్మిగనూరు నియోజకవర్గ అధ్యక్షులు శావల బుజ్జిబాబు మాదిగ,జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఎమ్మిగనూరు గౌరవ అధ్యక్షులు పెద్దముష్టి అబ్రహం మాదిగలు మాట్లాడుతూ... గత వారం క్రితం విశాఖపట్నం,బాపట్ల టిడిపి ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు సుబ్రహ్మణ్యం గుప్తా కోల్డ్ స్టోరేజ్ లో దాదాపుగా 1.89 లక్షలు గో మాంసం వీఆర్ఐ అధికారులకు పట్టు పడడం ఆశ్చర్యకరం. గతంలో ఓ దళితుడు క్యారియర్ బాక్స్ లో గోమాంసం తీసుకోవెళ్లాడని ఊచ కోత కోసి చంపివేయడం జరిగింది.