శ్రీశైలం: ఆత్మకూరు పట్టణంలో సమ్మర్ స్పోర్ట్స్ కోచింగ్ క్యాంప్ క్రీడాకారులకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేసిన ఎమ్మెల్యే బుడ్డా
ఆత్మకూరు పట్టణంలోని ఎన్‌టీఆర్ కేవీకే స్టేడియంలో నిర్వహిస్తున్న సమ్మర్ స్పోర్ట్స్ కోచింగ్ క్యాంప్ క్రీడాకారులకు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తొలిసారిగా భారీ స్థాయిలో సమ్మర్ కోచింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నామని, ఇవి క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడంలో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల పిల్లలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదుగుతారని చెప్పారు.