ఆత్మకూరు ఎస్: కోటపాడులో దళిత మహిళలకు అవమానం: బతుకమ్మ వేడుకల్లో కుల వివక్షపై ఆగ్రహం
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం కోటపాడులో దళిత మహిళలను బతుకమ్మ ఆడకుండా అడ్డుకోవడమే కాకుండా, మైలపడ్డాయని పసుపు నీళ్లు చల్లిన ఘటనపై కెవిపిఎస్ తీవ్ర నిరసన తెలిపింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి డిమాండ్ చేశారు.