నాంపల్లి: ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇంటి స్థలాలను అర్హులైన వారికి కేటాయించాలి: సిపిఐ (ఎం) మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి
నల్గొండ జిల్లా, నాంపల్లి మండల పరిధిలోని గట్లమల్లేపల్లి, నాంపల్లి మండల కేంద్రాలలో పేదలకు కేటాయించిన ప్రభుత్వ భూములను సోమవారం సాయంత్రం సిపిఐ (ఎం) మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇంటి స్థలాలను అర్హులైన వారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదల స్థలాలను కబ్జాదారులు ఆక్రమించుకోకుండా చూడాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన, ఇంటి స్థలం లేని పేదలందరికీ ప్రభుత్వం ఇంటి స్థలాలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.