శ్రీశైలం: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ఆత్మకూరు ఆర్టీసీ డిపో ఎదురుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన
ఇప్పటికే నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం ప్రజలకు మరో భారీ దెబ్బగా మారిందని సీపీఎం పార్టీ పట్టణ కార్యదర్శి ఏ.రణధీర్ అన్నారు.కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని శుక్రవారం సీపీఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ముందర నిరసన చేపట్టారు.పెరిగిన ధరలు వెంటనే అమలులోకి రావడంతో పాలక ప్రభుత్వాలు ఇంకెన్ని భారాలు మోపుతాయోనని సామాన్య పేద మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారని అన్నారు.పాలక ప్రభుత్వాలు ఎన్నికల ముందు ప్రజా సంక్షేమం కొరకే మా ప్రభుత్వాలు పనిచేస్తాయన్నారు.