పటాన్చెరు: అమీన్పూర్ మెడికల్ డివైస్ పార్క్‌లో హావెల్స్ లైఫ్ సైన్స్ కంపెనీ నూతన కెమిస్ట్రీ ల్యాబ్ ప్రారంభం :మాజీ మంత్రి KTR
అమీన్పూర్ మెడికల్ డివైస్ పార్క్‌లో హావెల్స్ లైఫ్ సైన్స్ కంపెనీ నూతన కెమిస్ట్రీ ల్యాబ్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. దేశంలో వాడే వైద్య పరికరాలను విదేశాలపై ఆధారపడకుండా స్వదేశంలో ఉత్పత్తి చేయాలన్న మాజీ సీఎం కేసీఆర్ ఆలోచనతో ఈ పార్క్ ఏర్పాటైందని కేటీఆర్ గుర్తు చేశారు. ఒకప్పుడు రాళ్ల మైదానంగా ఉన్న ఈ ప్రదేశం, ఇప్పుడు ఆధునిక వైద్య పరికరాల పరిశ్రమల కేంద్రంగా మారిందన్నారు.