జమ్మికుంట: గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో CM రేవంత్ రెడ్డి మంత్రులు పొన్నం శ్రీధర్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం
జమ్మికుంట: పట్టణ అభివృద్ధికి 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం స్థానిక గాంధీ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి ఒడితల ప్రణవ్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశిని కోటి మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ అభివృద్ధి కోసం నిధులు రావడం చాలా సంతోషకరమైన విషయం అని నియోజకవర్గ ఇన్చార్జి కృషి వల్లనే నిధులు మంజ మంజూరయ్యాయని అన్నారు.