శ్రీశైలం: మహానంది నల్లమల అడవిలో భారీ అగ్నిప్రమాదం. భయాందోళన గురవుతున్న పరిసర ప్రాంతాల ప్రజలు
మహానంది నల్లమల అడవిలో భారీ అగ్నిప్రమాదం చెలరేగింది. అడవిలో మంటలు వేగంగా విస్తరిస్తూ పరిసర ప్రాంతాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.ఆలయం వెనుక వైపున ఉన్న అడవిలో కార్చిచ్చు తీవ్రంగా వ్యాపిస్తోంది.మంటల దాటికి వన్యప్రాణులువిలవిలాడుతున్నాయి.అడవిలో అగ్ని వ్యాప్తిపై ఫారెస్ట్, రెవెన్యూ, ఫైర్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాలతో మంటలను అదుపు చేయడానికి అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.