వికారాబాద్: బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణ పారిశుద్ధ సేవకులకు సన్మానం, పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్
వికారాబాద్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ముఖ్య భూమిక పోషిస్తున్న పారిశుద్ధ సేవకులను,వారి శ్రమను గుర్తించి బ్రహ్మకుమారిస్ మధు అక్కయ్య ఆధ్వర్యంలో వికారాబాద్ మున్సిపల్ లో పనిచేస్తున్న పారిశుధ్య సేవకులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజూల రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికారాబాద్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో భాగంగా ఉదయం నాలుగు గంటలకే లేచి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ సేవకులను ఎన్నిసార్లు సన్మానించిన తక్కువేనని అన్నారు.