వికారాబాద్: జిల్లాలో 15 మండలాలకు, తాండూరు, పరిగి పట్టణాలకు నూతన అధ్యక్షులను నియమించిన జిల్లా BJP అధ్యక్షుడు మాధవరెడ్డి
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో BJP గెలుపు ఖాయమని BJP జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి పేర్కొన్నారు. రానున్న ఎన్నికల దృష్ట్యా పార్టీని బలోపేతం చేసే దిశగా BJP అధినేతలు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మెజార్టీ కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని జిల్లాలోని 15 మండలాలకు, తాండూరు, పరిగి పట్టణాలకు నూతన అధ్యక్షులను నియమించినట్లు ఆయన తెలిపారు.