ఒంగోలు అర్బన్: తల్లిని గదిలో పెట్టి తాళం వేసి, సజీవదహనం చేసిన ఒంగోలులోని వ్యక్తి
Ongole Urban, Prakasam | Apr 14, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని గద్దలకుంట రామాలయం వీధిలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న తల్లికి కన్న కొడుకు నిప్పు పెట్టి హత మార్చాడు. మృతురాలు వెంకట రమణమ్మగా పోలీసులు గుర్తించారు. అయితే కొడుకు ఎందుకు ఆమెను హతమార్చాడో తెలియవలసి ఉందని విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తావని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు మాటలను అర్పి మృతదేహాన్ని వెలికి తీసే పనిలో ఉన్నారు.