శ్రీకాకుళం: శ్రీకాకుళంలో వైసీపీకి షాక్: టీడీపీలోకి భారీగా చేరికలు
శ్రీకాకుళం మండలం లంకాం పంచాయతీ వార్డు సభ్యుడు, తోణంగి సర్పంచ్ మరియు 20 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. కూటమి ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఆకర్షితులై తాము పార్టీలో చేరినట్లు వారు వెల్లడించారు.