శ్రీశైలం: ఆత్మకూరు పట్టణంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, ప్రజలతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించిన ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి
ఆత్మకూరు పట్టణంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పాల్గొని ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు పాత బస్టాండ్ నుంచి గౌడ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ర్యాలీ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, వీధి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.