కొల్లకుంట గ్రామంలో సీజనల్ వ్యాధులపై అవగాహన ర్యాలీ నిర్వహించిన NSS విద్యార్థులు
హిందూపురం సప్తగిరి డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ వారి ఆధ్వర్యంలో హిందూపూర్ మండలం కొల్లకుంట గ్రామం ఒకటో వార్డులో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా ఐదవ రోజు సీజనల్ వ్యాధులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పర్యావరణం మరియు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్లకార్డులను చేతపట్టి దోమతెరలను వాడండి దోమ కాటు నివారించండి చెత్త చెత్త బండికే ఇవ్వండి ఆరోగ్యమే మహాభాగ్యం ఇంటింటా చెట్టు ఊరువనం ప్లాస్టిక్ వాడకం నివారించండి పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించండి ఇంటింటా చెట్టు ఊరువనం మొదలైన నినాదాలు ఇస్తూ గ్రామంలోని ర్యాలీ నిర్వహించారు.