గంగవరం: మండలం నడింపల్లి వద్ద ఉన్నటువంటి అక్షర మానసిక వికలాంగుల వసతి గృహంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు భాస్కర్, శివశంకర్లు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గాయత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మానసిక వికలాంగుల వసతి గృహంలో పిల్లల ముందు ఈ కార్యక్రమం జరపడం ఆనందదాయకమన్నారు.