శ్రీశైలం: ఆత్మకూరు మండలంలోని పురుగుమందు దుకాణాలను తనిఖీ చేసిన మండల వ్యవసాయ అధికారి బ
ప్యారాక్వాట్ గడ్డి మందును ప్రభుత్వం పూర్తిగానిషేధించినట్లు మండల వ్యవసాయ అధికారి హేమలత తెలిపారు. శనివారం ఆత్మకూరు మండలంలోని పలు పురుగుమందుల దుకాణాలను ఆమె తనిఖీ చేసి, ప్యారాక్వాట్ నిల్వలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్యారాక్వాట్ డైక్లోరైడ్ 24% SL అత్యంత విషపూరితమైన కలుపు మందు అని, ఇది మనుషుల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని చెప్పారు. ప్రస్తుతం దీనికి ఎటువంటి ప్రత్యేక ప్రతివిషం (యాంటిడోట్) అందుబాటులో లేదని పేర్కొన్నారు.ప్రభుత్వం జారీ చేసిన నిషేధ ఉత్తర్వులు 22-05-2026 తేదీ నుండి అమల్లోకి వచ్చాయని, తదుపరి దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ నిషేధం ఉంటుందన్నారు.