కథలాపూర్: దివ్యాంగులకు పెన్షన్ డబ్బులను పెంచాలని నిరసన
జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం దివ్యాంగులు నిరసన వ్యక్తంచేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు పెన్షన్ డబ్బులను పెంచాలని డిమాండ్ చేశారు. ఇతర సామాజిక పెన్షన్లను రెట్టింపు చేయాలన్నారు. అనంతరం అధికారులకు వినతి పత్రం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి లక్ష్మీరాజం,రవి నాయక్,శంకర్,భూమేష్ పాల్గొన్నారు.