రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్టెడ్ అయిన చిలమత్తూరు మండలం తుమ్మలకుంట గ్రామానికి చెందిన నవీన్
అవయవ దానంతో ఆరుగురికి పునర్జన్మ
చిలమత్తూరు మండలం తుమ్మలకుంట గ్రామానికి చెందిన నవీన్ ఇటివలే చిలమత్తూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. వైద్యులు బ్రెయిన్ తప్ప అన్ని అవయవాలు బాగున్నాయని అవయవ దానం సూచించడంతో. తన కుమారుడు మరణాన్ని తట్టుకొని ఆదర్శంగా ఆలోచించిన తల్లి, తన బిడ్డ అవయదానానికి అంగీకరిస్తూ దానం చేసి ఆరుగురికి ఆయువు పోసింది.తన బిడ్డ చనిపోతూ 6 గురికి ఆయువుపోశాడు అంటూ కన్నీరు మున్నీరైంది