గుంతకల్లు: గుత్తిలో కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారికి చెందిన శారదమ్మ అనే మహిళ అదృశ్యం, పోలీసులకు ఫిర్యాదు
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఓ మహిళ అదృశ్యమైంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారికి చెందిన శారదమ్మ అనే మహిళ గుత్తి పట్టణంలో ఈ నెల 12న బంధువుల వివాహ వేడుకకు వచ్చింది. ఈ క్రమంలో పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న శివాలయం వద్దకు అదే రోజు రాత్రి అక్కడికి వచ్చిన ఆమె ఇక కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు బంధువులు, కుటుంబసభ్యులు గుత్తిలో గాలించారు. చుట్టుపక్కల గాలించినా శారదమ్మ ఆచూకీ లభ్యం కాలేదు. తెలిసిన వారి ఇళ్ల వద్ద గాలించినా జాడ కానరాలేదు. మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు